- Advertisement -
హైదరాబాద్: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఆదివారం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, మరో 24 గంటలపాటు సాయి తేజ్ ను అబ్జర్వేషన్ లోనే కొనసాగిస్తామని వైద్యులు తెలిపారు. శుక్రవారం రాత్రి సాయి ధరమ్ తేజ్ తన స్పోర్ట్స్ బైక్ పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
Sai Tej collar bone surgery success: Apollo doctors
- Advertisement -