Saturday, December 21, 2024

సాయిచంద్‌కు నడిగడ్డతో విడదీయరాని అనుబంధం

- Advertisement -
- Advertisement -

గద్వాల టౌన్: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39)గురువారం గుండెపోటుతో అకాల మరణం చెందడంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాయిచంద్ తనగానంతో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, ఆయన మరణం తెలంగాణకు తీరనిలోటు అని పేర్కొన్నారు.

తెలంగాణ పోరాటంలో ఎక్కడ ఏ బహిరంగసభ జరిగినా ఉద్యమ ఆకాంక్షలను తన గాత్రంతో ప్రజలకు చేరవేయడానికి సాయిచంద్ చేసిన కృషిని ఎమ్మెల్యే కొనియాడారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆభగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, పీఏసీయస్ చైర్మన్ సుభాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్‌గౌడ, ఎంపీపీ విజయ్, జడ్పీటీసీ రాజశేఖర్, వైస్‌ఎంపీపీ రామకృష్ణనాయుడు, గట్టు, గద్వాల బీఆర్‌ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు వేణు, సంతోష్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News