Wednesday, January 22, 2025

ప్రపంచ వేదికలపై తెలంగాణ పాటను వినిపించిన గాయకుడు సాయిచంద్

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతికిరణ్

సంగారెడ్డి టౌన్: సింగర్ సాయించంద్ అరుదైన పాటలతో యావత్ కళానైపుణ్యంతో రాతి గుండెలను కదిలించిన తెలంగాణ ముద్దబిడ్డ ఆయన మృతి తెలంగాణకు తీరని లోటని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్‌లో బిఆర్‌ఎస్ నాయకుడు కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయిచంద్ సంస్మరణ సభలో ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతి కిరణ్‌లు సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ పాటలతో అందరిని ఊపు ఊపిన తెలంగాణ గాయకుడు సాయిచంద్ అని కొనియాడారు. ఉద్యమ ఆకాక్షంలను పాట రూపంలో అందరికి వినిపించిన గాయకుడన్నారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ ప్రపంచవేదికలపై పాటై నిలిచిన సింగర్ సాయిచంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, నాయకులు బీరయ్య యాదవ్,ప్రేమనందం తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News