Thursday, January 23, 2025

సాయిచంద్ భౌతికకాయానికి నివాళులర్పించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని సిఎం కెసిఆర్ తెలిపారు. సాయిచంద్ భౌతికకాయానికి సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. తెలంగాణ సమాజం మంచి గాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సాయిచంద్ సతీమణిని ఓదార్చారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.  సాయిచంద్ అకాల మరణం తనని ఎంతో కలిచి వేసిందని ఎంఎల్‌సి కవిత తెలిపారు. సాయిచంద్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Saichand passed away

Also Read: ఎలుగుబంటిని చంపి… భర్త, సోదరుడిని కాపాడిన మహిళ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News