Wednesday, January 22, 2025

సాయిచంద్ మృతి తీరని లోటు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : మలిదశ ఉద్యమ కెరటం, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మెన్, ప్రముఖ కవి గాయకుడు వేద సాయిచంద్ గుండెపోటుతో మరణించడం పట్ల ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయిచంద్ మరణ వార్త విని షాక్‌కు గురయ్యానని, మంచి ఆప్తుడిని, గొప్ప మనస్సు ఉన్న మా తమ్ముడిని కోల్పోయినదుకు చాలా ఉందన్నారు. నిత్యం నాతో పాటు నా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ నేను చేపట్టే ప్రతి కార్యక్రమంలో ముందుండి తన ఆట, పాట ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చిన వీరుడు భౌతికంగా మా దగ్గర లేనప్పటికి ఎప్పుడు మాకు గుర్తుంటాడని అన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ మంచి నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడిని, కళాకారుడిని కోల్పోయిందన్నారు. సాయిచంద్ చేసిన సేవలను బిఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ యావత్ ప్రజానీకం ఎన్నటికి మర్చిపోదని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి సాయిచంద్ మరణం పట్ల సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News