Tuesday, January 21, 2025

రాష్ట్ర గిడ్డంగుల ఛైర్ పర్సన్‌గా సాయిచంద్ సతీమణి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్ పర్సన్‌గా సాయిచంద్ సతీమణి వేద రజని ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థ ఛైర్మన్‌గా పనిచేస్తూ ఇటీవల గుండెపోటుతో మరణించిన తెలంగాణ ఉద్యమ నాయకుడు సాయిచంద్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలిచింది. ఆ కుటుంబానికి బిఆర్‌ఎస్ పార్టీ తరుపున రూ.1.50 కోట్లు ఆర్ధికసాయం కూడా ప్రకటించింది. అంతే కాకుండా సాయిచంద్ సతీమణి వేద రజనికి ప్రభుత్వ కార్పోరేషన్ పదవి కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం శుక్రవారం నాడు గిడ్డంగుల కార్పోరేషన్ చైర్‌పర్సన్‌గా ఉత్తర్వులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News