Sunday, December 22, 2024

ఫిర్యాదుదారుడినే చితకబాదిన సైదాబాద్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

భార్య చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఫిర్యాదుదారుడినే పోలీసులు చితకబాదారు. స్టేషన్‌లోని ఓ గదిలోకి తీసుకెళ్లి లైట్స్ ఆఫ్ చేసి మరి ఎస్‌ఐ, ఎఎస్‌ఐలు రబ్బర్ కట్టెలతో కొట్టారు. విషయం తెలుసుకున్న బాధితుడి బంధువులు పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్‌కు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన బుధవారం సైదాబాద్ పోలీసు స్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన రాంసింగ్(65), శకుంతల(56) భార్యభర్తలు. రాంసింగ్ శామీర్‌పేట్‌లో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏప్రిల్ 29న శకుంతల పక్కంటి సువర్ణతో గొడవ జరిగింది. ఇరువురు దుర్భషలాడినంతరం శకుంతల ఇంట్లోకి వెళ్లి పడుకుంది. రెండు రోజుల అనంతరం శకుంతలకు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఉస్మానియా హాస్పటల్‌లో చేర్పించారు. కానీ ఆమె ఐదు రోజుల అనంతరం చికిత్స పొందుతూ చనిపోయింది.

దీంతో రాంసింగ్ పక్కంటి సు వర్ణ కుటుంబికులే కొట్టడంతో చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 174కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టు తరువాత నిందితుల పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పోస్టుమార్టం రిపోర్టు సాధారణ మరణమని బిపి, షు గర్ ఎక్కువై చనిపోయిందని వచ్చింది. బుధవారం రాత్రి పోస్టుమార్టం రిపోర్టుపై అనుమానాలు ఉన్నాయని రాంసింగ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడి ఉన్న ఎస్‌ఐ సాయి క్రిష్ణా రాంసింగ్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లి లైట్స్ ఆఫ్ చేసి మరో ఎఎస్‌తో చితకబాధాడని ఆరోపించారు. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబికులు వెంటనే పోలీసు స్టేషన్‌కు చేరుకున్ని ఎస్‌ఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుడిని చికిత్స కోసం ఉస్మానియా హాస్పటల్‌కు తరలించారు.

ఎస్‌ఐ, ఎఎస్‌ఐల పై చర్యలు తీసుకోవాలి : రాంసింగ్
పోస్టుమార్టం రిపోర్టుపై అనుమానాలు ఉండటంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లాను. ఇన్‌స్పెక్టర్ లేకపోవడంతో ఎస్‌ఐ సాయి క్రిష్ణాను కలిశాను. కానీ సాయి క్రిష్ణా మళ్లీ స్టేషన్‌కు వచ్చావా అంటూ ఓ గదిలోకి తీసుకెళ్లాడు. షుగర్ ఉందని ఎంత చెప్పిన ఇష్టానుసారంగా కొట్టాడు. దెబ్బలు తగలడం లేదని మరో ఎఎస్‌ఐ వచ్చి మెడలపై చెంపల పై కొట్టాడు. కింద కూర్చోవాలని హుకుం జారీ చేశా రు. వయస్సులో పెద్దవాడిని కింద కూర్చోలేక పోతున్న అన్ని చెప్పిన బలవంతంగా కొట్టుకుంటూ కింద కూర్చోబెట్టారు. తనను హింసించి వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోస్టుమార్టం రిపోర్టు సాధారణ మరణమని వచ్చింది : ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర
రాంసింగ్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లి లైట్స్ ఆఫ్ చేసి కొట్టారని వస్తున్న ఆరోపణలు అవాస్తవం. పోలీ సు స్టేషన్‌లో అలాంటి ఘటనే జరగలేదు. కావాలంటే సిసి కెమెరాలు పరిశీలించుకోవచ్చు. గత ంలో కూడా రాంసింగ్‌కు భార్య పోస్టుమార్టం రిపోర్టు అందజేశామని అనుమానాలు ఉంటే అడ్వకేట్‌ను సంప్రదించండిన్ని చెప్పాం. పోలీసు శాఖ తరపున కూడా రెండో సారి ఉస్మానియా హెచ్‌ఓడిని అడిగామని వారు కూడా బిపి, షుగర్ ఎక్కువై చనిపోయిందని మరోసారి రిపోర్టు ఇచ్చారు. లీగల్ సలహా కూడా తీసుకున్నామని పోస్టుమార్టం ఆధారంగా ముందుకు వెళ్లాలని సూచించారని తెలిపారు. రాంసింగ్ దురుద్ధేషంతోనే అవాస్తవాలు చెప్పుతున్నారని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News