Monday, December 23, 2024

మహిళ హత్య కేసులో నిందితుడిని పట్టించిన పచ్చబొట్టు

- Advertisement -
- Advertisement -

చివ్వెంల: గతేడాది దురాజ్ పల్లి వద్ద జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడిని పచ్చబొట్టు పట్టించింది. గతేడాది నవంబర్ నెలలో చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద గుర్తు తెలియని మహిళను హత్య చేసి తగలబెట్టిన కేసును సూర్యాపేట పోలీసులు ఛేదించారు. మహిళ ఒంటిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా సూర్యాపేట డిఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో రెండు బృందాలగా ఏర్పడి మహిళను గుర్తించి హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు.

ఆత్మకూర్(ఎస్) మండలం రామన్న గూడెం గ్రామానికి చెందిన సామ జయమ్మ (60) భర్తతో గొడవ పడి సూర్యాపేటలో తన పిల్లలతో కలిసి నివాసముంటున్నది. ఈ క్రమంలో సూర్యాపేట కు చెందిన ఆర్టీసీలో కాంట్రాక్టు బేసిక్ డ్రైవర్ గా పని చేస్తున్న కొరిపెల్లి సైదులు తో పరిచయం ఏర్పడింది. కొద్దీ రోజుల క్రితం కొంత డబ్బు అవసరం ఉండగా జయమ్మ వద్ద రూ.90వేలు నెలలో తిరిగి ఇస్తా అని సైదులు తీసుకున్నాడు. నిర్ణిత గడువు లోపు తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడంతో జయమ్మతో సైదులు గొడవ పెట్టుకున్నాడు.దీంతో గతేడాది నవంబర్ నెలలో చివ్వెంల మండలం దురాజ్ పల్లి వద్ద ఆమెను హత్య చేసి గుర్తుపట్టకుండా తగలబెట్టినట్లు పోలీసుల ఎదుట నిందితుడు ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News