Saturday, December 21, 2024

‘ఎన్టీఆర్ 30’ షూటింగ్‌లో అడుగుపెట్టిన సైఫ్..

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తన 30వ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రధారి సైఫ్ అలీఖాన్ సెట్స్‌పైకి వచ్చేశాడు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. మంగళవారం నుంచి ఆయన సెట్స్‌లో చేరినట్టు యూనిట్ ప్రకటించింది.

ఈ మేరకు సైఫ్, ఎన్టీఆర్, కొరటాల కలిసి దిగిన ఫోటోలను విడుదల చేశారు. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో ఓ సెట్ వేశారు. అందులోనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్లపై వస్తోంది ఈ సినిమా. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News