Wednesday, January 22, 2025

స్నేహితులే కొట్టి చంపారు..

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్‌నగర్‌లో ఈ నెల 2న జరిగిన మర్డర్ మిస్టరీని జవహర్‌నగర్ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చేధించారు. శనివారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డిసిపి డి.జానకి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.కౌకూర్ భరత్‌నగర్‌కు చెందిన యువకుడు సైఫ్‌అలీఖాన్(25)తో పాటు నిందితులు ఏ1వాలి శ్రవణ్‌కుమార్ అలియాస్ మైక్ అలియాస్ అభిలాష్(29),ఏ2 దొబ్బల విక్రమ్ అలియాస్ గుడ్డు(24) రాజీవ్ గృహకల్ప భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.ఏ3 బూరుపల్లి విఘ్నేశ్ వంశి అలియాస్ ఎల్లమ్(19)అల్వాల్ వెంకటాపురంలో నివాసం ఉంటున్నాడు.ఏ4 సుజల్ పోలీసులకు దొరకకుండా పారిపోయాడు.

అయితే ఈ నెల 2వ తేదిన భరత్‌నగర్‌లో రాత్రి 10.30 గంటలకు వాలి శ్రవణ్,విఘ్నేశ్‌లు కాలనీలోని కిరాణ దుకాణం వద్ద సిగరేట్ తాగుతుండగా మృతుడు సైఫ్‌అలీఖాన్ కాలనీలో కొందరితో గొడవపడుతుండటం చూసి మిత్రుడైన శ్రావణ్‌కుమార్ అతనిని చేతితో కొట్టి గొడవను సద్దుమనిపించాడు.అనంతరం వీరంతా అక్కడి నుంచి వచ్చి దొబ్బల విక్రమ్ ఇంటికి చేరుకున్నారు.కాలనీ వాసుల సమక్షంలో తనపై చేయి చేసుకోని అవమానపరిచారని సైఫ్‌అలీఖాన్ మిత్రులతో గొడవపడ్డాడు.దీంతో ముగ్గురు స్నేహితులు కలిసి మృతుడిని చేతులతో,కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు.గాయాలతో పడి ఉన్న మృతుడిని కాలనీలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఉన్న ఖాళీ స్థలం వద్ద పడేసి మరోసారి కర్రలతో కొట్టి కాళ్లపై పెట్రోల్ పోసి నిప్పటించారు.

చనిపోయాడని నిర్దారించుకున్న నిందితులు అక్కడి నుండి పారిపోయారు. మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ కె.సీతారాం తన సిబ్బందితో రంగంలోకి దిగి 24 గంటల వ్యవధిలోనే మర్డర్ మిస్టరీని చేధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా మరో నిందితుడు సుజల్ కోసం గాలిస్తున్నారు.రాచకొండ కమిషనర్ డిఎస్.చౌహాన్ జవహర్‌నగర్ పోలీసులను అభినందించారు.ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌వోటీ డిసిపి గిరిధర్,కుషాయిగూడ ఎసిపి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News