- Advertisement -
తనపై జరిగిన దాడిపై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సైఫ్ మాట్లాడుతూ.. తాను ఎక్కువగా సెక్యూరిటీని నమ్మనని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. బహుశా తాను మరికొన్ని మంచి సినిమాలు చేయాలని.. కుటుంబం, స్నేహితులతో మరికొంత మంచి సమయాన్ని గడపాలని రాసుందని.. అందుకే తాను సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలిపారు.
కాగా, జనవరి 16, 2025న బాంద్రాలోని తన నివాసంలోకి దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీ ఖాన్‌ను కుటుంబ సభ్యులు ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. రెండు శస్త్రచికిత్సలు చేసిన తర్వాత సైఫ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.
- Advertisement -