Saturday, December 21, 2024

తారక్‌కు విలన్‌గా బాలీవుడ్ స్టార్..

- Advertisement -
- Advertisement -

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీకపూర్ కథానాయిక. అయితే ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ ని విలన్‌గా రంగంలోకి దించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అతనెవరో కాదు… సైఫ్ అలీఖాన్. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. దీన్ని క్యాష్ చేసుకోవాలని కొరటాల శివ కోరుకుంటున్నారు.

అందుకే పాన్ ఇండియాకు తగిన హంగులన్నీ తన కథలో ఉండేటట్టు జాగ్రత్త పడుతున్నారు. జాన్వీని రంగంలోకి దించడానికి ప్రధాన కారణం అదే. ఇప్పుడు సైఫ్ అలీఖాన్‌ని సైతం విలన్‌గా మారిస్తే ఈ సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని కొరటాల భావిస్తున్నాడట. ప్రస్తుతం సైఫ్‌తో కొరాటాల అండ్ కో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో నటించడానికి సైఫ్ కూడా తన అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఈ నెలాఖరున ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈలోగా సైఫ్ ఎంట్రీపై ఓ స్పష్టత వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News