Sunday, December 22, 2024

ఆటో డ్రైవర్ల ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

Saifabad police arrested gang of auto drivers

 

హైదరాబాద్ : బయటి రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులను దోచుకుంటున్న ఆటో డ్రైవర్ల ముఠాను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5,000 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ జాయింట్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని యాకత్‌పురా, బాగ్ ఈ జహనారాకు చెందిన మహ్మద్ సోహైల్ సలాం నమస్తే ట్రావెల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఫలక్‌నూమాకు చెందిన ఎండి మోయిన్, బాలాపూర్‌కు చెందిన సోహైల్ ఖాన్ అలియాస్ సోహైల్ ఆటోడ్రైవర్లు, సయిద్ నదీం ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. భవానీనగర్‌కు చెందిన షేక్ జఫర్ ఆటో డ్రైవర్,జూపార్క్‌కు చెందిన షేక్ మోషిన్ ఆటోడ్రైవర్, యాకత్‌పురాకు చెందిన మహ్మద్ హజీ పాషా అలియాస్ హజీ ఆటో సలాం నమస్తే ట్రావెల్స్‌కు యజమానిగా పనిచేస్తున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముందార్ కోల్ కరీంనగర్ జిల్లా, డికొండ, నామాపూర్‌లోని మెగా ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కరీంనగర్‌కు వెళ్లేందుకు మిగతా వర్కర్లతో కలిసి గత నెల 30వ తేదీ 12 గంటలకు నగరానికి వచ్చాడు. ట్యాంక్ బండ్ సమీపంలో మిగతా వారితో కలిసి బస్సు దిగాడు.

అక్కడికి ఇద్దరు ఆటోడ్రైవర్లు వచ్చి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కరీంనగర్‌కు పంపిస్తామని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి సలాం నమస్తే ట్రావెల్స్ ఆఫీసులకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఉన్న సిబ్బంది ప్రవర్తన అనుమానస్పదంగా ఉండడంతో అనుమానం వచ్చి తమ కంపెనీ మేనేజర్ శర్మకు వాట్సాప్‌లో లొకేషన్ పంపించారు. ఆటోడ్రైవర్లు ట్రావెల్స్ సిబ్బందితో కలిసి బాధితులపై దాడి చేసి రూ.5,000 నగదు, మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. బాధితులను తెల్లవారుజామున 4గంటల వరకు ట్రావెల్స్ ఆఫీసులో కూర్చొబెట్టుకుని తర్వాత వదిలేశారు. తర్వాత బాధితులను ఆటోలో తీసుకుని వచ్చి ఆరాంఘర్ చౌరస్తాలో వదిలేసి వెళ్లారు. ఈ సమయంలో బాధితులు ఆటోల నంబర్లు టిఎస్12 యూసి 6038, టిఎస్ 11 యూసి 6754 ను గుర్తించుకున్నారు. తమ వద్ద ఉన్న మరో ఫోన్ ద్వారా కంపెనీ సూపర్‌వైజర్‌కు ఫోన్ చేయడంతో వెంటనే వారి వద్దకు వచ్చి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైఫాబాద్ డిఐ రాజునాయక్ తదితరులు కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

ట్రావెల్స్ కంపెనీలతో కుమ్మక్కు…

మిగతా రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులను టార్గెట్‌గా చేసుకుని నిందితులు దోచుకుంటున్నారు. ఈ దోపిడీలో ట్రావెల్స్ యజమానులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు. నగరంలోని అఫ్జల్‌గంజ్‌లోని షాలీమర్ ట్రావెల్స్, కెజిఎన్ ట్రావెల్స్, ఆశీర్వాద్ లేదా నీతా ట్రావెల్స్ లకిడికాపూల్, జ్యోతి ట్రావెల్స్, అబ్బా బస్, గోల్కొండ ట్రావెల్స్, సవేరా ట్రావెల్స్, సంగీత ట్రావెల్స్, రామ్ ట్రావెల్స్ వీరితో కలిసి దోచుకుంటున్నారు. బయటి రాష్ట్రాలకు చెందిన వారికి నగరం తెలియకపోవడంతో వీరు వారికి నగరం నుంచి వారి వెళ్లాల్సిన ప్రాంతానికి పంపిస్తామని చెప్పి ట్రావెల్స్ ఏజెన్సీకి తీసుకుని వెళ్లి అమాయకులను దోచుకుంటున్నారు. గతంలో కూడా ఇలాగే చాలామందిని నిందితులు దోచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News