Sunday, December 22, 2024

చిత్రకళలో రాణిస్తున్న విద్యార్థి

- Advertisement -
- Advertisement -

బీబీపేట్ మండలంలోని ఉప్పర్‌పల్లి గ్రామానికి చెందిన కే.సాయికుమార్ గౌడ్ అనే విద్యార్థి చిత్ర లేఖనంలో రాణిస్తున్నాడు. ప్రముఖుల చిత్ర పటాలను గీస్తు తన కళ విజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు. అనేక సందేశాత్మక చిత్రాలతో పాటు రాజకీయ నాయకులు చిత్రపటాలను గీసి అబ్బురపరుస్తున్నాడు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ చిత్రాన్ని గీసి జిల్లా వైస్ చైర్మన్ చేతులమీదుగా బుదవారం అందజేసారు. ప్రభుత్వ సహాకారం అందిస్తే ఇంకా మంచి చిత్రాలను గీస్తానని సాయికుమార్ అన్నారు. ఇంతకు మందు కూడా మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ గంపగోవర్దన్, పారిశ్రామిక వేత్త సుభాష్ రెడ్డి చిత్రాలను గీసి వారికి జ్ఞాపిగా అందజేసారు. బీబీపేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న నైజాం కాలంనాటి పోలీస్టేషన్, దుబ్బ బంగ్లాల చిత్రాలను గీసిన విద్యార్థి అందరిదృష్టి ఆకర్శిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News