- Advertisement -
కోచి : భారత నౌకాదళానికి చెందిన విమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌లో గురువారం తెల్లవారు జామున 19 ఏళ్ల నావికుడు సీలింగ్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. ప్రాథమిక సమాచారం బట్టి అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని రక్షణశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. మృతుడు బీహార్ లోని ముజఫర్‌పుర్‌కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. దీనిపై కేరళ లోని స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు రక్షణ శాఖ పేర్కొంది. నౌకాదళంలో ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో పలువురు బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు గతంలో జరిగాయి.
- Advertisement -