మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక చైర్మన్‌గా సిహెచ్.సాయిలును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డి పదవీకాలం ఈ నెల 18న ముగిసింది. టిఎస్‌పిఎస్‌సి సభ్యుల్లో ప్రస్తుతం సాయిలు ఒక్కరే ఉన్నారు. పభ్యుడిగా సాయిలు పదవీకాలం నవంబర్ 1 వరకు ఉంది. పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించే వరకు లేదా సాయిలు పదవీకాలం ముగిసే వరకు ఆయన తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. సాయిలు టిఎస్‌పిఎస్‌సి తాత్కాలిక చైర్మన్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డిసెంబరులో ఘంటా చక్రపాణి పదవీకాలం ముగిసినప్పటీ నుంచి తాత్కాలిక చైర్మన్‌తోనే టిఎస్‌పిఎస్‌సి కొనసాగుతోంది. త్వరలో భారీగా ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి చైర్మన్, సభ్యుల నియామకం త్వరలో జరుగుతుందని భావిస్తున్నారు. విశ్రాంత ఐపిఎస్ నవీన్‌చంద్‌ను టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా నియమించే అవకాశం కనిపిస్తోంది. సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం వివిధ అంశాలను పరిగణనలోనికి తీసుకుని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Sailu Appointed as interim chairman of TSPSC