Sunday, December 22, 2024

అబుదాబీ నుంచి స్వగ్రామానికి చేరుకున్నా మృతదేహం

- Advertisement -
- Advertisement -

మాక్లూర్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన ఎడగొట్టు సాయిలు ఆర్థిక సమస్యల వల్ల గత ఎనిమిదేళ్ల కిందట అబుదాబికి వెళ్లి పని చేస్తున్నాడు. కాగా ఇటివల గుండెపోటుతో మృతి చెందగా ఆయన మృత దేహాన్ని విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. కాగా బుధవారం పియుసి ఛైర్మన్, ఆర్మూర్ ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి స్వయంగా అంబులెన్సు ఏర్పాటు చేసి హైదరాబాద్‌ నుంచి సాయిలు మృతదేహాన్ని స్వగ్రామం గుత్పకు తరలించారు. మృతుడికి ఇద్దరు కూతుర్లు, భార్య, తల్లి ఉన్నారు. ఈసందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్మూర్ ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి సహకారంతో స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించడం పట్ల మృతుని భార్య రజిత, కుటుంబ సభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News