Sunday, January 19, 2025

బిజెపి అభ్యర్థినికి వంటిల్లే బెటర్ !

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సైనా ఆగ్రహం

న్యూఢిల్లీ: కర్నాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప బిజెపికి చెందిన మహిళా అభ్యర్థినిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దావణగెరె దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 92 ఏళ్ల కురువృద్ధ కాంగ్రెస్ నాయకుడు శివశంకరప్ప ఇటీవల దావణెగెరె లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాయత్రీ సిద్దేశ్వరపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తీవ్రంగా ఖండించారు. మాజీ కేంద్ర మంత్రి జిఎం సిద్దేశ్వర భార్య అయిన గాయత్రి సిద్దేశ్వర వంట చేయడానికి మాత్రమే పనికి వస్తారంటూ శివశంకరప్ప ఇటీవల వ్యాఖ్యానించడంపై సైనా మండిపడ్డారు.

పురుషాహంకారంతో నిండిన ఈ వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని ఆమె ఎకక్స్ వేదికగా తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కావాలని శివశంకరప్ప అంటున్నారని, లడకీ హూ లడ్ సక్తీ హూ అని నినాదాలు ఇచ్చే పార్టీ(కాంగ్రెస్)కి చెందిన సీనియర్ నాయకుడి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు ఊహించలేదని సైనా పేర్కొన్నారు. కాగా..ఇటీవల శఙవశంకరప్ప మాట్లాడుతూ దావణగెరె నుంచి బిజెపి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాయత్రరి సిద్దేశ్వరకు మాట్లాడడం కూడా సరిగ్గా రాదని, ఆమె ఇంట్లో వంట చేసుకోవడానికే పనికి వస్తారని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికలలో ప్రజల మద్దతును కోరడానికన్నా ముందు ఆమె దావణగెరె సమస్యలను అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News