Friday, December 20, 2024

మూడో రౌండ్‌లో సైనా

- Advertisement -
- Advertisement -

Saina Nehwal has reached the third round of the WBC

సిక్కిఅశ్విని జోడీ ముందంజ
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్

టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మూడో రౌండ్‌కు చేరుకుంది. సైనా రెండో రౌండ్ ఆడకుండానే ముందంజ వేయడం విశేషం. సైనా రెండో రౌండ్‌లో తలపడాల్సిన ప్రత్యర్థి నవోవి ఒకుహారా (జపాన్) గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో సైనాకు వాకోవర్ లభించింది. ఇక మూడో రౌండ్‌లో బుసానన్‌వైవోన్‌ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో సైనా తలపడుతుంది. అంతకుముందు మంగళవారం జరిగిన మొదటి రౌండ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా విజయం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్‌తో జరిగిన మొదటి రౌండ్‌లో సైనా 2119, 219తో జయకేతనం ఎగుర వేసింది. మొదటి గేమ్‌లో సైనాకు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు నువ్వానేనా అన్నట్టు తలపడడంతో పోరు ఆసక్తికరంగా సాగింది. కానీ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన సైనా సెట్‌ను దక్కించుకుంది. ఇక రెండో గేమ్‌లో మాత్రం సైనాకు ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. ఈసారి ఆరంభం నుంచే భారత స్టార్ దూకుడుగా ఆడింది.

ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన సిక్కి రెడ్డిఅశ్విని పొన్నప్ప జంట ముందంజ వేసింది. తొలి రౌండ్‌లో భారత జోడీ 217, 2119 తేడాతో మాల్దీవ్స్‌కు చెందిన అమీనత్ నబిహాఫాతిమా జంటను ఓడించింది. తొలి రౌండ్‌లో భారత జోడీకి పెద్దగా పోటీ ఎదురు కాలేదు. అయితే రెండో గేమ్‌లో మాత్రం భారత జంటకు ప్రత్యర్థి జోడీ నుంచి గట్టి తప్పలేదు. కానీ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత జంట సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన పూజసంజన జోడీ విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మూడు సెట్ల సమరంలో సంజన జంట 216, 1021, 2114 తేడాతో పెరూకు చెందిన లూసియాపౌలా రీగల్ జంటను ఓడించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన భారత జంటకు రెండో గేమ్‌లో చుక్కెదురైంది. అయితే కీలకమైన మూడో గేమ్‌లో మళ్లీ భారత జోడీ పుంజుకుంది. చివరి వరకు దూకుడగా ఆడుతూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది.

కాగా, పురుషుల డబుల్స్‌లో అర్జున్‌ధ్రువ్ కపిల జోడీ తొలి రౌండ్‌లో విజయం సాధించింది. అయితే భారత్‌కే చెందిన మనుసుమీత్ జంటకు మొదటి రౌండ్‌లోనే చుక్కెదురైంది. కానీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన ఇషాన్ భట్నాగర్‌తనీషా క్రాస్టో జంట విజయం సాధించింది. అంతకుముందు తొలి రోజు జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు లక్షసేన్, ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్‌లు విజయం సాధించారు. ఇదిలావుండగా గాయం కారణంగా భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News