Wednesday, January 22, 2025

నేనిక్కడే ఉంటానురా… ఎక్కడికి ఎళ్ళను… రమ్మను…

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ తన ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం కోసం‘హిట్’ తో విజయాల్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొల‌ను తో చేతులు కలిపారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌లను అందించిన స్టార్, దర్శకుడు, నిర్మాత నుంచి దేశవ్యాప్తంగా ఆకట్టుకునేలా రూపొందిస్తున్న ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు భారీగా వున్నాయి. మేకర్స్ ఈరోజు టైటిల్ పోస్టర్‌, గ్లింప్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘సైంధవ్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. వెంకటేష్ పవర్ ఫుల్ లుక్ లో చేతిలో తుపాకీ పట్టుకుని టెర్రిఫిక్ గా కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కారు, పేలుడును చూడవచ్చు. టైటిల్ పోస్టర్‌లో ‘సైంధవ్’ యాక్షన్‌లో ఎక్కువగా వుంటుందని, వెంకటేష్ ఇంటెన్స్ పాత్రలో నటిస్తున్నారని అర్ధమౌతుంది.

వెంకటేష్ ఒక మెడిసన్ వయాల్ ఉన్న కూల్ బాక్స్‌తో చంద్రప్రస్థ అనే ఓడరేవు ప్రాంతంలోకి ఇంటరై, అక్కడ కంటైనర్ నుంచి తుపాకీని బయటకు తీస్తాడు. చివరగా గూండాల గ్యాంగ్ ని ఉద్దేశించి.. “నేనిక్కడే వుంటార్రా… ఎక్కడికి ఎళ్ళను… రమ్మను…” అంటూ హెచ్చరించడం గ్లింప్స్ లో ప్రెసెంట్ చేశారు. గ్లింప్స్ సినిమా స్వభావం, దాని టోన్, ఇందులో వెంకటేష్ ఎలాంటి పాత్ర చేయబోతున్నారో చూపిస్తుంది. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభిస్తామని కూడా మేకర్స్ ప్రకటించారు. గ్లింప్స్ వీడియోకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

‘సైంధవ్’ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుండి ప్రొడక్షన్ నెం 2. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ‘శ్యామ్ సింగరాయ్’ తో నిర్మాణంలో విజయవంతంగా అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే భారీ స్థాయిలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇది వెంకటేష్‌ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. ఇతర నటీనటులను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ‘సైంధవ్’ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణన్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: ఎస్.మణికందన్
సంగీతం: సంతోష్ నారాయణ్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో : వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్
డిజిటల్ ప్రమోషన్స్: హాష్‌ట్యాగ్ మీడియా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News