Friday, October 18, 2024

‘సైంధవ్’ టీజర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ వెర్స్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రమోషన్ లో భాగంగా ఈ మూవీ టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ లో బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అదిరిపోయింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీపై టీజర్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News