Wednesday, January 22, 2025

అక్టోబర్ 16న ‘సైంధవ్’ టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ వెర్స్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’ ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా జనవరి 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రం టీజర్‌ను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లతో కూడిన భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో విడుదలైన చిత్రం గ్లింప్స్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసింది. టీజర్ ప్రేక్షకులకు ‘సైంధవ్’ వరల్డ్ గురించి ఇన్ సైట్ ఇవ్వనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News