Monday, December 23, 2024

సెలబ్రేషన్స్ మూడ్‌లో…

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మక నిర్మిస్తున్నారు. తాజాగా ‘సైంధవ్’ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ని విడుదల చేశారు. త్వరలో మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. స్టార్ కంపోజర్ సంతోష్ నారాయణన్ ఈ చిత్రం కోసం అద్భుతమైన ఆల్బమ్ సిద్ధం చేశారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన కౌంట్ డౌన్ పోస్టర్ లో వెంకటేష్ సెలబ్రేషన్స్ మూడ్‌లో ఆనందంగా కనిపించారు. పోస్టర్‌లో వెంకటేష్ సిగ్నేచర్ మూమెంట్ ఆకట్టుకుంది. ‘సైంధవ్’ జనవరి 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రిలీజ్ కు ఇంకా 75 రోజులు వుందని తెలియజేస్తూ విడుదల చేసిన కౌంట్ డౌన్ పోస్టర్ ప్రేక్షకులు, అభిమానులని అలరిస్తోంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా, జయప్రకాష్‌లతో కూడిన భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News