పెగడపల్లిః జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామ సర్పంచ్ సాయిని సత్తమ్మ నేషనల్ అవార్డు అందుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సాయిని సత్తమ్మను ఉత్తమ సర్పంచ్‌గా ఎంపిక చేసి జాతీయ అధ్యక్షుడు నల్ల రాధకృష్ణ చేతుల మీదుగా అవార్డు అందించారు. ఈ అవార్డుకు ఎంపికైన సర్పంచ్‌ను జాతీయ అధ్యక్షునితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎం. గౌతమ్, రాష్ట్ర కోఆర్డినేటర్ హనుమాండ్ల విష్ణు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి లక్ష్మీరాజంలు, సర్పంచ్‌ను శాలువా కప్పి, పూల బొకేలు అందించి ఘనంగా సన్మానించారు. సోమవారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజశేఖర్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు సాయిని రవీందర్‌లు పాల్గొన్నారు.