- Advertisement -
ముంబై: దిగ్గజ సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్, తన భార్య సైరా బాను నుంచి గత ఏడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సుమారు మూడు దశాబ్ధాల వైవాహిక బంధానికి వీరిద్దరు వ్యక్తిగత కారణాల వల్ల స్వస్తి పలికారు. అయితే తాజాగా రహమాన్‌కు సైరా కృతజ్ఞతలు తెలిపారు.
మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా సైరాకు ఓ సర్జరీ జరిగింది. ఈ సందర్భంగా క్లిష్ట సమయాల్లో తనకు మద్ధతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు చెబుతూ.. ఆమె రహమాన్‌కి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది వందన ఓ లేఖలో పేర్కొన్నారు. ‘మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా కొన్నిరోజుల క్రితం సైరాకు సర్జరీ జరిగింది. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచివారందరికి ముఖ్యంగా రహమాన్, లాస్ ఎంజిల్స్‌లోని రసూల్, ఆయన భార్య షాదితో పాటు స్నేహితులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు’ అని వందన లేఖని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
- Advertisement -