Saturday, January 11, 2025

చంద్రబాబు, పవన్ డ్రామాలు ఆడారు: సజ్జల

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ కలవడం చారిత్రక ఆవశ్యకతగా చెప్పుకొస్తున్నారని మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌పై మరోసారి సజ్జల కౌంటర్ ఇచ్చారు. నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాపత్రయపడుతున్నామన్నారు. వైసిపి ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాపత్రయపడుతున్నారని దుయ్యబట్టారు. విశాఖ గర్జన రోజు చంద్రబాబు, పవన్ డ్రామాలు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటంలో పవన్ అంత ఆవేశంగా ఎందుకు ప్రవర్తించారో అర్థం కావడంలేదన్నారు. చంద్రబాబు, పవన్ ఎందుకు కలవాలనుకుంటున్నారో చెప్పగలరా? అని సజ్జల ప్రశ్నించారు. ప్రభుత్వంపై కుట్ర చేస్తూ కావాలనే వారు డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం గ్రామంలో ఇండ్లు కూల్చారనడం పచ్చి అబద్ధమన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News