Monday, January 20, 2025

గుంట నక్కలవి పగటి వేషాలు: సజ్జల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఈ నాలుగేళ్ల పాలనలో చరిత్ర సృష్టించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చామని, అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో సిఎం జగన్ చేసి చూపించారని, ఈ నాలుగేళ్ల పాలనకే గుంట నక్కలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. మళ్లీ ఆ గుంట నక్కలు ప్రజల వద్దకు వస్తున్నాయని, మళ్లీ గుంట నక్కలు పగటి వేషాలకు రెడీ అయ్యారని, దత్తపుత్రుడితో ఎన్నికలకు పోవాలని చంద్రబాబు చూస్తున్నారని, నిలువు దోపిడీ చేయడానికి చంద్రబాబు వస్తున్నారని దుయ్యబట్టారు.

Also Read: శేషేంద్ర మేధో హక్కులు ఎవరివి?

అన్న క్యాంటిన్ పేరుతో ఎంత దోచుకున్నారో జనానికి తెలుసునన్నారు. పొత్తులతో పాచికలు వేయాలని చంద్రబాబు చూస్తున్నారని, రైతులకు రుణమాఫీ చేశామని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు హామీలిచ్చి ప్రజలను ఎలా? మోసం చేస్తారని అడిగారు. వైఎస్‌ఆర్‌సిసి కార్యకర్తలంతా సిఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులేనని, సమసమాజాన్ని నిర్మించే పనిలో సిఎం జగన్ ఉన్నారని కితాబిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News