Sunday, January 19, 2025

మరోసారి రాక్షసుల ముఠా ఏకమైంది: సజ్జల

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలతో దోపిడీలకు పాల్పడ్డారని వైఎస్‌ఆర్‌సిపి నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర నిధులను దోచేశారని, బాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యే 2019లో ఓడించారని ధ్వజమెత్తారు. ‘మహాదోపిడీ’ పుస్తకాన్ని వైఎస్‌ఆర్‌సిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. చంద్రబాబు ఎలా దోపిడీకి పాల్పడ్డారో ఈ పుస్తకంలో వివరించామని, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశామన్నారు. మరోసారి రాక్షసుల ముఠా ఏకమైందని, ఎపి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నుంచే వస్తోందని ఆరోపణలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News