Monday, January 20, 2025

సీఎం జగన్‌పై దాడి దారుణం: సజ్జల

- Advertisement -
- Advertisement -

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ ప్రదాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. సీఎం జగన్‌పై దాడి పిరికిపందల చర్య మండిపడ్డారు. జగన్ పై దాడి దారుణమని.. పక్కా ప్లాన్‌తో చేశారని ఆయన ఆరోపించారు. దాడికి ఎయిర్‌గన్ ఉపయోగించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దాడిని నటన అంటూ కొంతమంది మాట్లాడుతున్నారని.. మనపైనే మనం దాడి చేయించుకుంటామా? అంటూ విమర్శిచారు.

శనివారం రాత్రి విజయవాడలోని సింగ్‌నగర్‌లో మేమంతా సిద్దం బస్సు యాత్ర జరుగుతుండగా ఓ దుండగుడు సీఎం జగన్ పై రాళ్లతో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తుండగా దుండగులు విసిరిన రాళ్లలో ఒక రాయి సూటిగా వచ్చి జగన్‌ను తాకింది. జగన్ ఎడమ కంటికి పైభాగన ఉన్న కనుబోమ్మపై తాకటంతో గాయం అయింది.వెంటనే ఆయనకు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News