- Advertisement -
ఆయా వర్గాల్లో నాయకత్వం పటిష్టత కోసం ముఖ్యమంత్రి జగన్ ఎంతో కష్టపడ్డారని.. జగన్‌కి ఉన్న నిబద్ధత మరెవ్వరికీ లేదని ఎపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్‌సిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వడ్డెర ఆత్మీయ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. అన్ని వర్గాల మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారి నాయకత్వ పటిష్టకు చట్టం చేసి మరీ చర్యలు తీసుకున్నారని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత 23మంది వైసిపి ఎమ్మెల్యేలను లాక్కొని జగన్ ను తొక్కాలని చంద్రబాబు కుట్ర చేశాడని.. అయినా, జగన్ నిలబడ్డారని అన్నారు.
ఇన్నేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు బిసిలకు గురించి మాట్లాడలేదని.. ఇప్పుడు అధికారం కోసం బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చి హామీలను ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు బలం ఉంటే.. పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.
- Advertisement -