Sunday, December 22, 2024

చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు: సజ్జల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మడం లేదని ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సజ్జల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, టిడిపిని ప్రజలు చెత్తబుట్టలో వేశారని, ఆయన సభలకు జనం రావడం లేదని, ప్యాంట్రీ కారుపై అసత్య ప్రచారం చేయడం ఏంటని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అన్ని అనమతులతో తీసుకున్న ప్యాంట్రీ కారుపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబు తెలీడం లేదని విరుచకుపడ్డారు. ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు అప్పడే నిర్ణయం తీసుకున్నారని, స్పష్టమైన అజెండాతో వైఎస్‌ఆర్‌సిపి ఉందని ప్రజలకు తెలుసునని వివరించారు. ప్రజలకు ఏం చెప్పాలో తెలియక టిడిపి తప్పుడు ఆరోపణలు చేస్తుందని, బిజెపి అభ్యర్థులుగా టిడిపి నాయకులే ఉంటున్నారని, చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని ప్రజలకు తెలుసునని, గతంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు మరిచిపోలేదని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News