Wednesday, January 22, 2025

చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మెడికల్‌ రిపోర్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు మెడికల్ రిపోర్టులపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెడికల్ బెయిల్ పై ఉన్న చంద్రబాబు.. మరికొంత కాలం బెయిల్ పై ఉండేందుకు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని ఆరోపించారు. కానీ చంద్రబాబును చూస్తుంటే ఆరోగ్యవంతుడిగా కనిపిస్తున్నా.. అనారోగ్యంగా ఉన్నట్టు మెడికల్ రిపోర్టులు ఇచ్చారని తెలిపారు.

మెడికల్ బెయిల్ పై కూడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మెడికల్ రిపోర్టులు ఇచ్చిన వారు వైద్యులా? రాజకీయ నివేదికలా? అర్థం కావడం లేదన్నారు. మెడికల్ రిపోర్టులపై చంద్రబాబు నిర్వాకం స్పష్టంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారో మెడికల్ రిపోర్టులే ఉదాహరణ అని వివరించారు. ఇదంతా చంద్రబాబు పన్నాగామా? లేదంటే.. వైద్యులు గీత దాటారా? ఇది అనుమానాస్పదంగా ఉందన్నారు. అయితే చంద్రబాబు జైలులో ఉండడం ఎవరికీ ఇష్టం లేదు… మేం కూడా ప్రజా జీవితంలోకి రావాలనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News