- Advertisement -
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి, ఏ8గా ఉన్న ఆయన తోడల్లుడు చాణక్యను అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ అయ్యారు. ఆయనను ఎపి సిట్ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఆ తర్వాత ఎసిబి కోర్టులో శ్రీధర్‌రెడ్డిని సిట్ అధికారులు హజరుపర్చనున్నారు. కాగా, ఈ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించిన అధికారులు.. విచారణను వేగవంతం చేస్తున్నారు.
- Advertisement -