Monday, December 23, 2024

చంద్రబాబుపై సజ్జల ఆగ్రహం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుపై అమరావతి రింగ్ రోడ్డు, అసైన్డ్ ల్యాండ్, ఫైబర్ నెట్ కేసులు రాత్రికి రాత్రే పుట్టుకు వచ్చినవి కావని ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి వెల్లడించారు. వైసిపి ప్రతిపక్షంగా ఉన్నప్పుడే వీటి గురించి చెప్పిందని రెండేళ్లుగా ఈ కేసులపై విచారణ జరుగుతోందన్నారు. అలాగే బలమైన ఆధారాలు ఉన్నప్పుడు పిలిచి మాట్లాడతారని చెప్పుకొచ్చారు. గతంలో జగన్‌పై అక్రమ కేసులు పెట్టారని, కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కలపడం చంద్రబాబుకు మంచిదేనని సజ్జల చెప్పుకొచ్చారు. అరెస్ట్ చేయకపోతే నీతి పరుడిని అంటారని, అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు అంటున్నారని సజ్జల వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News