Sunday, January 19, 2025

సజ్జన్ జిందాల్‌పై అత్యాచారం కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ముంబైలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) సజ్జన్ జిందాల్‌పై అత్యాచారం కేసు నమోదు చేసింది. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌లో జిందాల్‌పై ఐపిసి సెక్షన్ 376, 354, 503 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వైద్యురాలు అయిన ఓ మహిళ తనపై అత్యాచారానికి సంబంధించి 2022 ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. మహిళ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు 2023 డిసెంబర్ 13న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News