Sunday, December 22, 2024

ఏఎస్ ఆర్‌టియూ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా సజ్జనర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ ఆర్‌టియూ ) స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా టిఎస్ ఆర్‌టిసి ఎండి విసి సజ్జనర్ ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలోని ఇండియా హబిటెంట్ సెంటర్ లో జరిగిన ఏఎస్‌ఆర్‌టియూ 54వ జనరల్ బాడీ మీటింగ్‌లో స్టాండింగ్ కమిటీ నూతన ఛైర్మన్‌గా దేశంలోని ఆర్‌టిసిల ఎండిలు టిఎస్ ఆర్‌టిసి ఎండి విసి సజ్జనర్ ఐపీఎస్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ పదవీలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారని ఏఎస్ ఆర్‌టియూ ఈ మేరకు శనివారం ప్రకటించింది. అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్‌గా టిఎస్ ఆర్‌టిసి చీఫ్ మెకానిక్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు ఎన్నికైనట్లు తెలిపింది. స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన విసి సజ్జనర్ ఐపిఎస్‌కి ఏఎస్‌ఆర్‌టియూ వైస్ ప్రెసిడెంట్ ఏపీఎస్ ఆర్‌టిసి ఎండి ద్వారక తిరుమల రావు ఐపిఎస్, ఇతర రాష్ట్రాల ఆర్‌టిసి ఎండిలు అభినందనలు తెలియజేశారు. తనను ఎన్నుకున్న ఆర్‌టిసిల ఎండిలకు ధన్యవాదాలు తెలిపిన విసి సజ్జనర్.. స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News