Sunday, December 22, 2024

సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు: సజ్జనార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువతకు యూ ట్యూబ్, సోషల్ మీడియా పిచ్చిలో పడి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. రోడ్లపై, రైల్వే ట్రాక్ ల మీద డ్యాన్స్ లు చేస్తూ ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు తీరని దు:ఖాన్ని మిగుల్చుతున్నారు.  లైకులు, పాలోవర్స్ పెంచుకోవడం కోసం స్టంట్ లు చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. పాఠశాలలో చదివే బాలిక రోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ చేయడంతో వైరల్ గా మారింది.  దీనిపై టిఎస్ ఆర్ టిసి ఎండి సజ్జనార్ ట్వీట్ చేశారు. నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరమైన విషయమన్నారు. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం యువతరానికి ఉందన్నారు. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేయడం మంచిది కాదని హితువు పలికారు. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనందమో.. ఏమో అని అసహనం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News