Monday, December 23, 2024

అద్దె బస్సు యాజమానుల సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీ: సజ్జనార్

- Advertisement -
- Advertisement -

అద్దె బస్సు యాజమానుల సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. గురువారం హైదరాబాద్ బస్ భవన్ లో అద్దె బస్సు యాజమానులతో సజ్జనార్ సమావేశమయ్యారు.

అనంతర ఆయన మీడియాతో మాట్లాడుతూ..”అద్దె బస్సు యాజమానులు కొన్ని అంశాలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. మహాలక్ష్మి స్కీం అమలు తర్వాత ఇబ్బందులు గురవుతున్నామని చెప్పారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ఈ రోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆ కమిటీ అన్ని అంశాలను శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తుంది. సంస్థ బస్సులు, హైర్ బస్సుల డేటాను క్రోడికరించి.. ఒక నిర్ణయం తీసుకుంటుంది. దీనిపై హైర్ బస్సు యాజమానులు సానుకూలంగా స్పందించారు” అని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News