Sunday, December 22, 2024

బిగ్‌బి అమితాబ్‌కు ఆర్టీసి ఎండి అభ్యర్థన

- Advertisement -
- Advertisement -

‘ఆమ్వే’ లాంటి మోసపూరిత సంస్థలకు సహకరించొద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి

హైదరాబాద్: సీనియర్ ఐపిఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ తాజాగా బిగ్‌బి అమితాబచ్చన్‌కు కీలక అభ్యర్థన చేశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సహా సెలబ్రిటీలకు ‘ఆమ్వే’ లాంటి మోసపూరిత సంస్థలకు సహకరించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి మోసపూరిత సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని ఆయన అభ్యర్థించారు. అమితాబ్ లాంటి స్టార్ హీరోలు ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహారించడం సరికాదని ఆయన సూచించారు.

ఆమ్వేకు బిగ్‌బి ప్రచారం చేయడంపై ఆయన్ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ఈ ట్వీట్ చేశారు. గతంలోనూ ‘క్యూనెట్’ లాంటి సంస్థలకు సంబంధించిన యాడ్స్‌లో నటించొద్దని, అలాంటి కంపెనీలను ప్రమోట్ చేయొద్దని సజ్జనార్ కోరారు. భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ఆ ట్వీట్ చేశారు. కాగా, సజ్జనార్ హైదరాబాద్ సిపిగా ఉన్న సమయంలో పలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలపై చర్యలు తీసుకున్నారు.

ఆమ్వే ఆరోగ్యం, సౌందర్యానికి సంబంధించి పలు ఉత్పత్తులను మార్కెట్ చేసే ఒక అమెరికన్ ఆధారిత సంస్థ. అయితే, ఆమ్వే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్‌లకు పాల్పడుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతేడాది ఏప్రిల్‌లో ఆరోపించింది. సంస్థ అసలు ఉద్దేశం ఉత్పత్తులను విక్రయించడం కాదనీ, గొలుసుకట్టు స్కీముల్లో ప్రజలను చేర్పించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అప్పట్లో ఈడీ ఆమ్వేకు చెందిన సుమారు రూ.757 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News