Sunday, December 22, 2024

సిగ్నల్ వద్ద ఆత్రం ఏ మాత్రం పనికిరాదు.. ఎమ‌న్నా అదృష్ట‌మా ఇది!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిగ్నల్స్ వద్ద ఆత్రం ఏమాత్రం పనికి రాదని ఆర్‌టిసి ఎండి వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో బైక్ పై వెళ్తున్న ఓ జంట సిగ్నల్ క్రాస్ చేయబోతుండగా లారీ కిందకు చొచ్చుకుపోయారు. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి ప్రమాదమూ జరలేదు. అయితే ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కాగా విసి సజ్జనార్ ట్టిట్టర్ ద్వారా నెటిజెన్లతో పంచుకున్నారు. అందరికి వీరిలా అదృష్టం ఉండదని, సిగ్నల్స్ వద్ద ఏమాత్రం ఆత్రం పనికి రాదని వివరించారు. అలాగే రహదారులపై లేన్ డ్రైవింగ్‌ను విధిగా పాటించాలని సూచించారు. ఇలా అడ్డదిడ్డంగా వెళ్లి రోడ్డు ప్రమాదాలకు కారణమై విలువైన ప్రాణాలను పోగొట్టుకోకండని సజ్జనార్ హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News