Monday, January 13, 2025

‘బస్సే క్షేమం అంటున్న రాధేశ్యామ్’

- Advertisement -
- Advertisement -
Sajjanar Tweet Radhe Shyam Meme Goes Viral
ట్వీట్ చేసిన ఆర్టీసి ఎండి విసి సజ్జనార్

హైదరాబాద్: రాధేశ్యామ్ సినిమా గురించి ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్టీసి ఎండిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆర్టీసి అభివృద్ధి కోసం తనదైన శైలిలో పాటు పడుతున్న ఆయన ఇందుకోసం సోషల్ మీడియాను ఆయుధంగా మలుచుకున్నారు. ప్రజా రవాణాను ప్రజలకు చేరువయ్యేలా సినిమా డైలాగులు, సీన్లతో మీమ్స్, పోస్టులు పెడుతున్నారు. ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఆర్టీసి బస్సుల ప్రమోషన్ కోసం రాధేశ్యామ్ సినిమాను వాడుకున్నారు. ఆర్టీసి బస్సులో వెకేషన్‌కు వెళదామా? ఇందులో భాగంగా సినిమాలో ప్రభాస్, పూజాహెగ్డేల మధ్య జరిగే సంభాషణను తనదైన శైలిలో ఎండి సజ్జనార్ రీక్రియేట్ చేశారు. ఇందులో చాలా రోజుల తర్వాత కలిశాం, ఏదైనా వెకేషన్‌కు వెళదామా?’ అని ప్రభాస్ అనగా ‘వెళదాం కానీ, ఆర్టీసి బస్సులోనే వెళదాం’ అని పూజా అంటుంది. ‘ఎందుకు?’ అని రెబల్‌స్టార్ తిరిగి ప్రశ్నించగా ‘ఎందుకంటే ఆర్టీసి ప్రయాణం సురక్షితం, సుఖమయం’ అని పూజా సమాధానం ఇస్తుంది. ఈ పోస్టుకు ‘బస్సే క్షేమం అంటున్న రాధేశ్యామ్’ అని ఒక టైటిల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News