- Advertisement -
బెట్టింగ్ యాప్‌లను నిర్మూలించేందుకు ఆర్టిసి ఎండి సజ్జనార్ కృషి చేస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా ఆయన సోషల్‌మీడియాలో ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ప్రారంభించారు అయితే ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఇద్దరు గాయణీ మణులు సరికొత్తగా బెట్టింగ్ యాప్‌లను వాడకండి అంటూ ప్రమోట్ చేశారు. మన్మథుడు సినిమాలోని ‘వద్దురా సోదారా..’ పాటలోని లిరిక్స్‌ని బెట్టింగ్ యాప్‌ల వాడకానికి సూట్ అయ్యేలా మార్చి పాడారు. ఈ పాట నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటని సజ్జనార్ ‘వద్దు.. బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు!!’ అంటూ సందేశం పెట్టి ట్వీట్ చేశారు.
- Advertisement -