Thursday, January 23, 2025

బాధిత డ్రైవర్‌కు సజ్జనార్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆర్టీసి సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ ఎండి విసి సజ్జనార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి తార్నాక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ పాండును గురువారం ఆయన పరామర్శించారు. డ్రైవర్ పాండు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తార్నక ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ సైది రెడ్డి ఆయనకు వివరించారు. త్వరగా కోలుకోవడానికి మెరుగైన వైద్యం అందించాలని సజ్జనార్ సూచించారు. సంస్థ డ్రైవర్ల తప్పిదం ఏమీ లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాలలో రోడ్డు ప్రమాదాల వల్ల బాధితులుగా మారిన వారికి అండగా నిలుస్తామన్నారు. బాధిత డ్రైవర్లను స్వయంగా పరామర్శించడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నారు. కార్యక్రమంలో ఇడి (ఒ) మునిశేఖర్, అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News