Wednesday, January 22, 2025

‘సకల గుణాభి రామ’ ట్రైలర్ బాగుంది

- Advertisement -
- Advertisement -

Sakala Gunabhi Rama trailer released

ఈఐపిఎల్ పతాకంపై వి.జె.సన్నీ, శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ సింగ్ నటీనటులుగా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో సంజీవ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం సకల గుణాభి రామ. ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్, దర్శకుడు నాగేశ్వర్ రెడ్డిలు ఈ చిత్రంలోని పాటలను విడుదల చేయగా.. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో విశ్వక్ సేన్‌లు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బాగుంది.

రైటర్‌గా బిజీగా వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా కూడా బిజీ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ “ఇందులోని పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటల్లాగే సినిమా కూడా చాలా బాగుంటుంది”అని చెప్పారు. హీరో వి.జె సన్నీ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. అనుదీప్ నాలుగు మంచి సాంగ్స్ ఇచ్చాడు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వివేక్, కమేడియన్ శివారెడ్డి, హీరోయిన్లు ఆషిమా, తరుణి, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్, నటుడు వరుణ్ సందేశ్, రఘురాం, సింహాచలం, శ్రీ తేజ్, మానస్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News