Monday, December 23, 2024

బాధితులకు వైద్యం, న్యాయం, రక్షణ కల్పిస్తాం….

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : 2014 తరవాత తెలంగాణ ప్రభుత్వం కమిట్ మెంట్ తో పనిచేస్తుందని, భరోసా-సఖి లాంటి ప్రభుత్వ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని డిజిపి అంజన్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రూరల్ పోలీస్ స్టేషన్ అవరణలో సఖి, భరోసా భవనాలను డిజిపి అంజన్ కుమార్ తో మంత్రి హరీశ్ రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడారు. ఈ సెంటర్లు మహిళలకు, చిన్న పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని డిజపి పేర్కొన్నారు.

హైదరాబాద్ అందరికీ సురక్షితమైన నగరమని అడిషనల్ డిజిపి ఉమెన్ షెప్టి శిఖాగోయల్ తెలిపారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గోయల్ పేర్కొన్నారు.

ఈ భవనంను మహిళ సంరక్షణ సముదాయంగా వాడుకుందామని మంత్రి హరీష్ రావు తెలిపారు. బాధితులు ఎవరైనా ఇక్కడికి వచ్చి అన్నీ రకాలుగా న్యాయం పొందవచ్చని, ఇక్కడ బాధితులకు వైద్యం, న్యాయం, రక్షణ కల్పిస్తామని, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, మహిళల పై అత్యాచారాలు, దాడులు జరిగినపుడు ఇలాంటి భవనాలు ఎంతగానో దోహదం చేస్తాయని వివరించారు. రూ.1.18 కోట్లతో ఈ భవనం నిర్మాణం జరిగిందని, ఆకర్షణ అనే అమ్మాయి ఇక్కడ లైబ్రరీకి 780 బుక్స్ పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని, సిఎం కెసిఆర్ ఆలోచనల మేరకు పోలీస్ డిపార్ట్ మెంట్ తుచా తప్పకుండా పాటిస్తుందని హరీష్ రావు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిజిపి ఉమెన్ షెప్టి శిఖాగోయల్, డిఐజి రమేష్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత, తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News