Monday, December 23, 2024

కదులుతున్న ఆటోలో మహిళ గొంతుకోసి హత్య

- Advertisement -
- Advertisement -

ముంబయి: కదులుతున్న ఆటోలో ఓ మహిళ గొంతుకోసి హత్య చేసిన సంఘటన మహరాష్ట్ర రాజధాని ముంబయిలోని సకినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కైరాణి రోడ్డు దత్ నగర్‌లో ఓ ఆటోలో దీపక్ బోర్సే, పంచశీల వెళ్తున్నారు. ఆటో రన్నింగ్‌లో ఉన్నప్పుడు పంచశీల గొంతును దీపక్ కత్తితో కోశాడు. ఆమె ఆటోలో నుంచి బయటకు దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమె కొంచెం దూరం తరువాత స్పృహ తప్పి పడిపోవడంతో దీపక్ ఆమె మెడపై పలుమార్లు కత్తితో పొడిచాడు. వెంటనే స్థానికులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందని వెల్లడించారు. నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఆటోలో ఇద్దరు మధ్య గొడవ జరిగిందని ఆటో డ్రైవర్ తెలిపాడు.

Also Read: విశాఖలో బాలికపై స్వామీజీ అత్యాచారం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News