Wednesday, December 25, 2024

ప్రభుత్వంలో విలీనంపై మంత్రి దామోదర్ రాజనర్సింహకు సాక్స్ నేతల వినతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సాక్స్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం లేదా రెగ్యులరైజ్ చేయాలని సాక్స్ ఉద్యోగ సంఘం నేతలు తెలంగాణ సాక్స్ యూనియన్ నాయకులు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రికి వారు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వము 2014లో సాక్స్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వము విలీనం చేసుకున్నా లేదా రెగ్యులర్ చేసుకున్న తమకు ఎలాంటి అభ్యంతరము లేదని, తాము ఏ విధంగా అయితే డబ్బులు పంపించడం జరుగుతుందో అదే విధంగా ప్రతి సంవత్సరం డబ్బులు పంపించడం జరుగుతుందని సూచించిన విషయాన్ని వారు మంత్రికి వివరించారు.

కేంద్ర ప్రభుత్వ నివేదికను మంత్రికి చూపించి దీని ఆధారంగా తమకు న్యాయం చేకూర్చాలని మంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్ లో గత 20 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వములో ఈ ఉద్యోగులను విలీనం చేసుకోవాల్సిందిగా మంత్రిని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే సాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కి ఫోన్ చేసి విలీనం అంశంపై రిమార్కును పంపించవలసిందిగా కోరినట్లు సంఘం నేతలు తెలిపారు. మంత్రి స్పందించిన తీరుపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు ఎ రంజిత్ కుమార్, టి.శివప్రసాద్, శ్రీదేవి తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News