- Advertisement -
న్యూఢిల్లీ: రెజ్లర్ల నిరసన నుంచి తాను కాని, వినేష్ ఫోగట్ కాని, బజరంగ్ పూనియా కాని తప్పుకోవడం లేదని సాక్షి మాలిక్ సోమవారం స్పష్టం చేశారు. తాము ముగ్గురం రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాము తమ ఉద్యోగాలలో తిరిగి చేరామే తప్ప నిరసన నుంచి ఉపసంహరించుకోలేదని ఆమె సష్టం చేశారు.
తమ ఉద్యోగాలలో చేరడానికి వీలుగా ఫోగట్, పూనియా, సాక్షి రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం జోరుగా వదంతులు వ్యాపించిన దరిమిలా సాక్షి మాలిక్ ట్విటర్ వేదికగా ఈ మేరకు విరణ ఇచ్చారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్న రెజ్లర్ల గురించి చర్చించేందుకు సాక్షి, పూనియా, ఫోగట్ ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలుసుకున్నారు.
- Advertisement -