Monday, December 23, 2024

ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టిన రెజ్లర్ సాక్షి మాలిక్..

- Advertisement -
- Advertisement -

రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలుచుకున్న భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇకపై తాను రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనని చెప్పారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికల్లో సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా గెలవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంజయ్… బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సన్నిహిత అనుచరుడు. నిన్న మొన్నటి దాకా సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ పై రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినీత్ ఫోగట్ సహా పలువురు రెజ్లర్లు ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఢిల్లీ నడిబొడ్డున వారు దీక్షలు చేశారు. దాంతో బ్రిజ్ భూషణ్ ని తప్పించారు.

అయితే, బ్రిజ్ భూషణ్ సన్నిహితులను ఎన్నికల్లో పోటీ చేయనివ్వబోమంటూ ఇచ్చిన మాటను క్రీడా మంత్రిత్వ శాఖ  నిలబెట్టుకోలేదని సాక్షి మాలిక్ విమర్శించారు. సంజయ్ సింగ్.. బ్రిజ్ భూషణ్ కు కుడి భుజంలాంటి వాడని,  వ్యాపారాలలో అతని భాగస్వామి అనీ ఆమె చెప్పారు. సంజయ్ సింగ్ రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడిగా గెలిచినందున, తాను రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతున్నానంటూ తన బూట్లను విప్పి టేబుల్ పై పెట్టి, కన్నీళ్లతో నిష్క్రమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News