Wednesday, January 22, 2025

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ అద్భుతంగా ఉంది

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘గాండీధారి అర్జున.’. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాక్షి వైద్య మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలోని ఐరా పాత్రకు నేను సెట్ అవుతానని నన్ను తీసుకున్నారు. మంత్రిగా నాజర్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆయన పక్కన కనిపించే నా పాత్ర చాలా బాగుంటుంది. ప్రవీణ్ సత్తారు సన్నివేశాలను తెరకెక్కించే విధానం ఎంతో క్రియేటివ్‌గా ఉంటుంది. ఆయన డైరెక్షన్ అద్భుతంగా ఉంది. వరుణ్ తేజ్ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా ఎంతో ఒదిగి ఉంటారు. నాకు ఈ సినిమా చేసే సమయంలో ఆయన ఎంతో సాయం చేశారు. ఇక నేను హీరోయిన్‌గా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. నెక్స్ సాయిధరమ్ తేజ్‌తో సినిమా చేస్తా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News